అప్పట్లో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన హీరోయిన్ మీనా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే.. తన నటనతో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు సినీ ఇండస్ట్రీ లో అందరూ స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ ను పొందింది… ఆ తర్వాత విద్యాసాగర్ రావు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. తనకు ఒక పాప పుట్టాక మళ్ళీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది మీనా. అయితే ఈ మధ్యనే మేనా భర్త విద్యాసాగర్ కొన్ని అనారోగ్య సమస్యల వలన మరణించడం జరిగిందన్న విషయం మనకు తెలిసిందే. అయితే భర్త మరణం తర్వాత మీనా కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆ బాధ నుండి బయటకు తీసుకురావడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించారట. ఇక ఇప్పుడిప్పుడే ఆమె ఆ బాధ నుంచి కోలుకుంటున్న సమయంలో ఈమె పై మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందట… మీనా భర్త చనిపోవడంతో తన కూతురు నాన్న లేకుండా పెరగకూడదనే ఉద్దేశంతో వారికి బాగా పరిచయం ఉన్న ఓ వ్యక్తిని మీనా పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. అలాగే ఆ వ్యక్తి అంటే తన కూతురికి కూడా చాలా అభిమానమట.. దీంతో మీనా తల్లిదండ్రులు కూడా రెండో పెళ్లి చేసుకోమని పదేపదే ఇబ్బంది పెట్టడం వలన ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. heroine Meena going to get married for second time ఇక తన కూతురి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీనా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే మీనా సన్నిహితులు నుండి వచ్చిన సమాచారం ప్రకారం, మీనా అసలు ఏ పెళ్లి చేసుకోవడం లేదట. ఒకవేళ అలా చేసుకోవాలి అనుకుంటే మాత్రం కచ్చితంగా అఫీషియల్ గా అందరికీ తెలిసేలాగా చేసుకుంటుందని, ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు ఏవి నిజం కావనిఏది నిజం కావని స్పష్టం చేశారు. అసలు ఈ రెండో పెళ్లి విషయంలో ఎలాంటి వాస్తవం లేదని మీనా సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త లు ఆగాలంటే ఖచ్చితంగా మీనా స్పందించాల్సిందే…..!