ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ కుమార్తె వివాహం ఇటీవల హైద్రాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. కాగా, ఈరోజు గుంటూరులో వివాహ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు.
నూతన వధూవరుల్ని ఆశీర్వదించిన ఏపీ సీఎం ఇటీవలే అలీకి ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. తన కుమార్తె పెళ్ళి నేపథ్యంలో వైఎస్ జగన్ ఇచ్చిన బహుమతిగా ఆ పదవి గురించి అలీ చెప్పుకున్నారు. కాగా, వివాహ రిసెప్షన్‌కి హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్, నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. వైఎస్ జగన్ వెంట పలువురు వైసీపీ నేతలు ఈ వివాహ రిసెప్షన్‌లో సందడి చేశారు. ముఖ్యమంత్రి రాకతో తన కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు మరింత కళ వచ్చిందని నటుడు అలీ మురిసిపోయారు.