UPDATES  

 రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైకి చెందిన పింకీ ఇరానీ అనే మహిళను పోలీసులు అరెస్ట్

రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైకి చెందిన పింకీ ఇరానీ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సుకేష్‌కు జాక్వెలిన్‌ను పరిచయం చేసింది పింకీ అని భావిస్తున్నారు. సాక్ష్యాలు లభించిన తరువాత.. ఈ కేసులో పింకీ ఇరానీని అరెస్టు చేసి సంబంధిత కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ఆమెకు మూడు రోజుల పోలీసు కస్టడీ మంజూరు చేసింది ఢిల్లీ కోర్టు. గతంలోనూ ఇరానీని ఈడీ అరెస్టు చేయగా.. ఆమె బెయిల్‌పై విడుదల అయినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ కేసులో జాక్వెలిన్‌కు మంగళవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఫెర్నాండెజ్‌ను సెప్టెంబర్‌లో EOW ప్రశ్నించింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ వంటి ప్రముఖ వ్యక్తులతో సహా పలువురిని మోసం భారీ మొత్తంలో నగదు దోచుకున్నట్లు చంద్రశేఖర్ పై ఆరోపణలు వెలువడ్డిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రశేఖర్ జైలులో ఉండగా..

అతనితో జాక్వెలిన్ సన్నిహితంగా ఉండడంతో ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆమె పేరును జత చేస్తూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆగస్టు 17న చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో పలువురు సాక్షులు, సాక్ష్యాలను ఆధారం చేసుకున్నారు. ఆ తర్వాత కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్‌ను చేర్చడంతో ఆమె తరఫు న్యాయవాది బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జాక్వెలిన్ మాత్రమే కాకుండా.. మరో హీరోయిన్ నోరా ఫతేహి పెద్ద మొత్తంలో అతని నుంచి లగ్జరీ కార్లు.. ఇతర ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఈడీ చార్జ్ షీట్‏లో పేర్కొంది. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సుఖేష్ చంద్రశేఖర్ తదితరులపై నమోదైన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు విచారణను ఢిల్లీ కోర్టు డిసెంబర్ 12కి వాయిదా వేసింది. వాదనలు సిద్ధం చేసేందుకు ప్రాసిక్యూషన్ సమయం కోరగా, ప్రత్యేక న్యాయమూర్తి శైలేంద్ర మాలిక్ కేసు విచారణను వాయిదా వేశారు. ఆగస్టు 31న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిశీలించిన తర్వాత హాజరుకావాలని జాక్వెలిన్‌ను కోర్టు ఆదేశించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !