UPDATES  

 ‘హిట్ 2’ హిందీ రిలీజ్ కన్ఫర్మ్

‘హిట్’ మూవీతో ఘనవిజయం సాధించిన యువ దర్శకుడు శైలేష్ కోనేరు, 2021లో దాని సీక్వెల్‌ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న ‘హిట్2’ లో అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన మీనాక్షి చౌదరి జంటగా నటిస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా డిసెంబర్ 2, 2022న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

తాజాగా అడివి శేష్ ఈ సినిమా హిందీ వెర్షన్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ఇన్‌స్టా లైవ్‌లో కూడా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని, హిందీ వెర్షన్ రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తామని వెల్లడించాడు. రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి ‘హిట్ : ది సెకండ్ కేసు’ కి సంగీతం అందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !