UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకొని వ్యక్తిగత పూచికతపై విడుదల

తెలంగాణలో గత రెండు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఒక వైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర జరుగుతూ ఉండగా.. మరో వైపు వైయస్సార్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్రకు టిఆర్ఎస్ శ్రేణులు అడ్డు తలిగాయి. తన వాహనంపై దాడి చేయడంతో పాటు తన కార్యకర్తలను అడుకుని పాద యాత్రను అడ్డుకోవడంతో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఏకంగా ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకొని వ్యక్తిగత పూచికతపై విడుదల చేశారు. షర్మిల అరెస్ట్‌ పై గవర్నర్ తమిళి సై రాజన్ స్పందించారు. ఈ నేపథ్యంలోనే రేపు రాజ్ భవన్ కి వెళ్లి వైయస్ షర్మిల ఉదయం 11:30 నిమిషములకు గవర్నర్ ను కలవబోతున్నారు. ఆ సమయంలో ఏం మాట్లాడతారు అనే విషయమై అధికారికంగా క్లారిటీ లేదు.. కానీ తనపై జరుగుతున్న దాడుల పై గవర్నర్ కు ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి రాజకీయం గవర్నర్ వైపు వెళ్లడంతో ఆమె ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !