UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 మలైకా అరోరా ప్రెగ్నెంట్‌… వార్తలపై అర్జున్‌ సీరియస్‌

బాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ మలైకా అరోరా, అర్జున్‌ కపూర్‌ పెళ్లి చేసుకోకపోయినా లివిన్‌ రిలేషన్‌షిప్‌ కొనసాగిస్తున్నారు. అర్బాజ్‌ఖాన్‌తో తెగదెంపుల తర్వాత మలైకా.. అర్జున్‌తో డేటింగ్‌లో ఉంది. అయితే ఈ మధ్య మలైకా అరోరా ప్రెగ్నెంట్‌ అన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై అర్జున్‌ చాలా ఘాటుగా స్పందించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పుకార్లను తీవ్రంగా ఖండించాడు. ఈ వార్త రాసిన జర్నలిస్ట్‌, న్యూస్‌ పోర్టల్‌పై విరుచుకుపడ్డాడు. ఇంతకంటే దిగజారడానికి మరొకటి ఉండదని చాలా ఘాటుగా స్పందించాడు. తమ వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే సాహసం చేయొద్దని హెచ్చరించాడు. “ఇంతకంటే దిగజారుడుతనం మరొకటి ఉండదు. ఇలాంటి చెత్త వార్తను నువ్వు ఎంతో క్యాజువల్‌గా, ఏమాత్రం ఫీలింగ్స్ లేకుండా, అనైతికంగా రాశావు. ఈ జర్నలిస్ట్‌ చాలా రోజులుగా ఇలాంటి వార్తలే రాస్తున్నారు.

ఇలాంటి ఫేక్‌ గాసిప్‌ వార్తలను మేము పెద్దగా పట్టించుకోము కాబట్టి నువ్వు బతికిపోతున్నావ్‌. అలా అని వదిలేయలేం. మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే సాహసం చేయకు” అని చాలా గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు. అర్జున్‌, మలైకా తమ తొలి బిడ్డను ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నట్లు ఆ వార్త వెల్లడించింది. ఈ ఏడాది లండన్‌ ట్రిప్‌కు వెళ్లిన ఈ ఇద్దరూ ఈ విషయాన్ని తమ సన్నిహితులు, ఫ్రెండ్స్‌కు మాత్రమే చెప్పినట్లు ఆ వార్త తెలిపింది. గత నెలలోనే ఈ జంట లండన్‌ టూర్‌కు వెళ్లి వచ్చింది. ఇక ఈ మధ్యే మూవింగ్ ఇన్‌ విత్‌ మలైకా ప్రోగ్రామ్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న మలైకా అరోరా కూడా తన ఎంగేజ్‌మెంట్‌ అనే వార్తలకు ఊతమిచ్చేలా మాట్లాడింది. ప్రస్తుతానికి ఈ జంట అటు ఎంగేజ్‌మెంట్‌, ఇటు పెళ్లి విషయంలో ఎలాంటి కమిట్‌మెంట్‌ ఇవ్వలేదు. మూడేళ్ల కిందట ఈ జంట తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ను పబ్లిగ్గా వెల్లడించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !