UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 అయోధ్యలో హనుమాన్‌.. ప్రమోషన్లలో టీమ్‌ బిజీ

క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తొలిసారి ఓ ఇండియన్‌ సూపర్‌ హీరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ పేరు హను-మాన్‌. ఈ మధ్యే రిలీజైన ఈ పాన్‌ ఇండియా మూవీ టీజర్‌ సంచలనాలు సృష్టించింది. యూట్యూబ్‌లో తెలుగు టీజర్‌ వారం రోజుల్లో మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడీ మూవీ టీమ్‌ ప్రమోషన్లలో బిజీ అయింది. హను-మాన్‌ టీమ్‌ మంగళవారం (నవంబర్‌ 29) అయోధ్య వెళ్లింది. అక్కడ శ్రీరాముడి దర్శనం చేసుకుంది.

తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. టీజర్‌ సక్సెస్‌తో ఊపు మీదున్న టీమ్‌.. ప్రమోషన్లు మొదలుపెట్టే ముందు ఆధ్యాత్మిక టూర్‌కు వెళ్లింది. ఈ సినిమాలో అమృతా అయ్యర్‌ ఫిమేల్‌ లీడ్‌గా కనిపించనుంది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌లో నిరంజన్‌ రెడ్డి నిర్మాతగా చాలా భారీ బడ్జెట్‌తో హను-మాన్‌ రూపొందింది. గౌరాహరి, అనుదీప్‌ దేవ్, కృష్ణ సౌరభ్‌ల త్రయం ఈ సినిమాకు మ్యూజిక్ అందించింది. ప్రస్తుతం హను-మాన్‌ పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే మేకర్స్‌ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌ చేయనున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !