UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 ఇన్నోవేటివ్‌గా బెదురులంక 2012 మూవీ ఫస్ట్‌ లుక్‌

టైటిల్‌కు తగినట్లే కాస్త వెరైటీగా, ఇన్నోవేటివ్‌గా బెదురులంక 2012 మూవీ ఫస్ట్‌ లుక్‌ను కూడా ఆవిష్కరించారు. క్లాక్స్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను ఓ వీడియోతో లాంచ్ చేశారు. ఈ వీడియోలో వెనుకాల ఓ గడియారం తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రెండు గోల్డ్‌ రింగ్స్‌ను గాల్లోకి ఎగరేస్తూ హీరో ఎంట్రీ ఇస్తాడు. ఇందులో హీరో కార్తికేయ క్యాజువల్‌ బ్లాక్‌ డ్రెస్‌లో కనిపించాడు. ఈ ఫస్ట్‌ లుక్‌ కంటే రెండు రోజుల ముందే కార్తికేయ ప్రీలుక్‌ను రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేవలం హీరో చెయ్యి మాత్రమే కనిపిస్తోంది. ఆ చేతిపై రివైండ్‌, ఫార్వర్డ్‌, ప్లే, పాజ్ బటన్‌లు పచ్చబొట్టు పొడిపించుకొని హీరో కనిపిస్తాడు. ఆ ప్రీలుక్‌ ఎలా అయితే ఆసక్తి రేపిందో ఈ ఫస్ట్‌ లుక్‌ కూడా అలాగే ఉంది. ఈ మూవీలో కార్తికేయ సరసన డీజే టిల్లు ఫేమ్‌ నేహా శెట్టి నటిస్తోంది. ఇప్పటి వరకూ చూడని అతిపెద్ద గాలివార్త గురించి ఈ సినిమా చూపించనుంది.

ప్రపంచం ఇక ముగింపుకు వచ్చేసిందని నమ్మే ఓ ఊరి చుట్టూ తిరిగే కథ ఇది. 2012, డిసెంబర్‌ 21న ఇలాగే ప్రపంచం అంతమవుతుందని పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. దాని చుట్టూ సరదాగా సాగే కథ ఇది. ఈ మోషన్‌ పోస్టర్‌ గురించి ప్రొడ్యూసర్‌ రవీంద్ర బెనర్జీ మాట్లాడాడు. “సినిమా ప్రత్యేకత గురించి మా బెదురులంక 2012 మోషన్‌ పోస్టర్‌ చెబుతుంది. ప్రపంచం అంతమవుతుందన్న భావనలో ఉన్న ఓ ఊరిలో తర్వాత జరగబోయే పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇదొక ఫన్‌ ఎంటర్‌టైనర్. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ బాగుంటుంది. షూటింగ్‌ చివరి దశలో ఉంది. యానాం, కాకినాడ, గోదావరి పరిసరాల్లో షూటింగ్‌ చేశాం. ఇందులోని ఐదు పాటను ఎంతో బాగా ట్యూన్‌ చేశారు మణిశర్మ” అని చెప్పాడు. ఇదొక డ్రామెడీ జానర్‌ ఫిల్మ్‌ అని డైరెక్టర్‌ క్లాక్స్‌ చెప్పాడు. కార్తికేయలో ఓ కొత్త నటుడిని మీరు చూస్తారని తెలిపాడు. గ్రామీణ వాతావరణంలో సాగే ఈ స్టోరీ కామెడీ, ఎమోషన్స్‌, థ్రిల్‌ను పంచుతుందన్నాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !