బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి.
మన్యం న్యూస్ దుమ్ముగూడెం నవంబర్ 30::
బైకు అదుపుతప్పి రోడ్డుని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగారం గ్రామానికి చెందిన పాయం చినబాబు(25) s/o వీరయ్య సోమవారం తెల్లవారుజామున పని నిమిత్తం నారాయణరావుపేట గ్రామానికి తన బైక్ AP 07 BQ 6220 పై వెళుతూ మార్గమధ్యంలో గల పాలూరుపేట గ్రామ శివారులోకి వచ్చేసరికి బైకు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ వేగాన్ని అదుపు చేయలేక తనకు తానుగా బైకుతో సహా రోడ్డుమీద పడిపోయి తలకు బలమైన గాయం కావడంతో సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే భద్రాచలం హాస్పిటల్ తీసుకెళ్లే వైద్యం చేస్తుండగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయారని మృతిని తల్లి చిన్న రామమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.