మన్యం న్యూస్, అశ్వారావుపేట, నవంబర్ 30: టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు, డిసిసి అధ్యక్షులు పోదేం వీరయ్యల పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, రైతు, భూమి, వ్యవసాయ సమస్యలపై అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గరనుండి తాహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ తో నినాదాలు చేస్తూ తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి మండల తాహసిల్దార్ చల్ల ప్రసాద్ కి వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు సున్నం నాగమణి టీపీసీసీ మెంబర్, జడ్పిటిసి ములకలపల్లి, తాటి వెంకటేశ్వర్లు మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ మెంబర్ వగ్గెల పూజ, ఎంపీటీసీ వేముల భారతి, మొగల్లపు చెన్నకేశవరావు అశ్వారావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కొనకళ్ళ వెంకటరెడ్డి జడ్పిటిసి చండ్రుగొండ, దంజు నాయక్, కట్టం నరసింహారావు మరియు ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు & ఇన్చార్జిలు మరియు, జిల్లా & మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పోడు భూముల బాధితులు, ధరణి పోర్టల్ బాధితులు, రుణమాఫీ జరగని రైతులు, రైతు బీమా, రైతుబంధు బాధితులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్ కార్యాలయం లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అందుకే రైతుల కోసం రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. రైతు కోసం రైతు సంక్షేమం కోసం రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించడం రైతులకు మేలు చేస్తుందని తెలియజేస్తున్నాము, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక పథకాలు తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా వందలాదిమంది నిరుపేద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కావున ఇప్పటికైనా పోడు భూముల రైతులు, ధరణి పోర్టల్ బాధితులు, రుణమాఫీ జరగని రైతులు, రైతు బీమా, రైతు బంధు బాధితులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను తక్షణమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు మహిళలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.