హైద్రాబాద్‌లో ప్రగతి భవన్ యెదుట మెరుపు ధర్నాకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రయత్నించడం, ఆమెను పోలీసులు అరెస్టు చేయడం, సాయంత్రం ఆమెయి బెయిల్ రావడం.. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ హై టెన్షన్ వాతావరణం నెలకొనడం తెలిసిన విషయాలే. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్ షర్మిల చేస్తున్న రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలు వెరసి, అధికార తెలంగాణ రాష్ట్ర సమితికీ – వైఎస్సార్ తెలంగాణ పార్టీకీ మధ్య గర్షణకు కారణమయ్యింది.
వర్ధన్నపేట నుంచి షురూ… వర్ధన్నపేటలో వివాదం ముదిరి పాకాన పడి.. వ్యవహారం భౌతిక దాడులు, వాహనాల ధ్వంసం వరకూ వెళ్ళింది. ఈ నేపథ్యంలో షర్మిల , హైద్రాబాద్‌లో ప్రగతి భవన్ వద్ద మెరుపు ధర్నాకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇదిలా వుంటే, వర్ధన్నపేటలో ఆగిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర హైకోర్టు అనుమతితో తిరిగి ప్రారంభం కానుంది. రేపటి నుంచి వైఎస్ షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్రను పునః ప్రారంభించోతున్నారు. మహబూబాబాద్ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. రేపు పాదయాత్ర ప్రారంభించాక వైఎస్ షర్మిల, నిన్నటి హైద్రాబాద్ ఘటనలపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.