నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వం లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ 2 మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు లో విడుదల అయ్యి భారీ వసూళ్లను దక్కించుకుంటున్న సమయం లో హిందీలో కూడా ఈ సినిమా ను రిలీజ్ చేసి అక్కడ కూడా సంచలన కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ సాధించి చిన్న సినిమాల్లో పెద్ద హిట్ అన్నట్లుగా నిలిచింది.
ఈ సినిమా ఓటీటీ ద్వారా కూడా ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అయింది. తాజాగా జీ తెలుగు ద్వారా ఈ సినిమా శాటిలైట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఊహించిన స్థాయిలో ఈ సినిమా కు రేటింగ్ రాకపోవడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారీ స్థాయిలో రేటింగ్ వస్తుందని ఆశించిన చిత్ర యూనిట్ సభ్యులు 8 కూడా రేటింగ్ రాక పోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఎక్కువ శాతం మంది థియేటర్స్ లేదా ఓటీటీ ద్వారా చూసేశారు. కనుక ఇప్పుడు శాటిలైట్ ద్వారా చూడడానికి ఎక్కువ మంది మిగిలి లేరు. అందుకే తక్కువ మంది టీవీల్లో చూశారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కార్తికేయ 2 ఈ స్థాయి రేటింగ్ తెచ్చుకోవడం కూడా చాలా గొప్ప విషయం అన్నట్లుగా నిఖిల్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.