UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 కార్తికేయ 2 ఈ స్థాయి రేటింగ్ తెచ్చుకోవడం కూడా చాలా గొప్ప విషయం

నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వం లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ 2 మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు లో విడుదల అయ్యి భారీ వసూళ్లను దక్కించుకుంటున్న సమయం లో హిందీలో కూడా ఈ సినిమా ను రిలీజ్ చేసి అక్కడ కూడా సంచలన కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ సాధించి చిన్న సినిమాల్లో పెద్ద హిట్ అన్నట్లుగా నిలిచింది.

ఈ సినిమా ఓటీటీ ద్వారా కూడా ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అయింది. తాజాగా జీ తెలుగు ద్వారా ఈ సినిమా శాటిలైట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఊహించిన స్థాయిలో ఈ సినిమా కు రేటింగ్ రాకపోవడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారీ స్థాయిలో రేటింగ్ వస్తుందని ఆశించిన చిత్ర యూనిట్ సభ్యులు 8 కూడా రేటింగ్ రాక పోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఎక్కువ శాతం మంది థియేటర్స్ లేదా ఓటీటీ ద్వారా చూసేశారు. కనుక ఇప్పుడు శాటిలైట్ ద్వారా చూడడానికి ఎక్కువ మంది మిగిలి లేరు. అందుకే తక్కువ మంది టీవీల్లో చూశారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కార్తికేయ 2 ఈ స్థాయి రేటింగ్ తెచ్చుకోవడం కూడా చాలా గొప్ప విషయం అన్నట్లుగా నిఖిల్‌ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !