UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల హంగామా

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల హంగామా మొదలైంది. అన్ని పార్టీల నేతలు ప్రజలను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. ఏపీలో ఎన్నికలను సామాజిక సమీకరణాలే ఎక్కువ ప్రభావితం చేస్తాయి. గెలుపోటములను డిసైడ్‌ చేస్తాయి. 2019లో సీఎం జగన్‌ రికార్డు విజయానికి ఈ సామాజిక సమీకరణాలు కీలకంగా పని చేసాయి. ఇక, ఇప్పుడు సీఎం జగన్‌కు కమ్మ సామాజికవర్గం దూరమైందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కమ్మ వర్గం జగన్‌ వెంటే ఉందని గ్రామస్తులు చెప్పటం.. అందుకు కృతజ్ఞతగా డిప్యూటీ సీఎం పాదాభివందనం వైరల్‌ అవుతున్నాయి. Chandrababu బాబు సొంత జిల్లాలో డిప్యూటీ సీఎం.. ఎప్పుడూ ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. మరోసారి ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు.

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన కమ్మ వర్గానికి చెందిన ఒక సీనియర్‌ సిటిజన్‌కు పాదాభివందనం చేశారు. ఈ ఆసక్తికర ఘటన టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో చోటు చేసుకుంది. జిల్లాలోని పెనుమూరు మండలం మొరవకండ్రిగలో డిప్యూటీ సీఎం పార్టీ నేతలతో కలిసి పర్యటించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి.. వారికి అందుతున్న సంక్షేమం గురించి ఆరా తీశారు. కమ్మల్లో మార్పు వచ్చిందంటూ.. మొరవకండ్రిగలో ఒక సీనియర్‌ సిటిజన్‌ ఫ్యామిలీ వద్దకు వెళ్లారు నారాయణ స్వామి. అక్కడ ఉన్న మహిళను మీకు డ్వాక్రా రుణ మాఫీ జరిగిందా అని ప్రశ్నించగా ఆ మహిళ అవునని సమాధానం ఇచ్చారు. పెన్షన్‌ వస్తుందా అంటూ వాకబు చేశారు. దీంతో, మీకా.. అక్కడే ఉన్న వ్యక్తిని చూస్తూ ఆ పెద్దాయనకా అని ప్రశ్నించారు. దీనికి స్పందనగా ఆ పెద్దాయన తనకు వస్తుందని.. తాను రైతునని పరిచయం చేసుకున్నారు. తన పేరు రాధానాయుడు అంటూ డిప్యూటీ సీఎంకు తమకు అందుతున్న పథకాల గురించి వివరించారు. సీఎం జగన్‌ పాలన బాగుందని..ఆయన మరోసారి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుంటుందంటూ రాధా నాయుడు చెప్పుకొచ్చారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !