జబర్దస్త్ షో లో మొదట జడ్జ్ లుగా నాగబాబు మరియు రోజా లు వ్యవహరించిన విషయం తెల్సిందే. ఇద్దరు కూడా చాలా సంవత్సరాల పాటు కంటిన్యూ అయ్యారు. నాగబాబు మల్లెమాల వారితో విభేదాల కారణంగా ఆ మధ్య జబర్దస్త్ నుండి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత పలువురు గెస్ట్ జడ్జ్ లుగా వ్యవహరించిన విషయం తెల్సిందే. మెల్ల మెల్లగా మనో కు మంచి పాపులారిటీ దక్కింది. మనో జబర్దస్త్ యొక్క పర్మినెంట్ జడ్జ్ గా మారినట్లే అని అంతా అనుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మనో కనిపించడం లేదు. గత కొన్ని వారాలుగా కంటిన్యూగా కృష్ణ భగవాన్ జబర్దస్త జడ్జ్ గా వస్తున్నాడు. ఈయన గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఆ సినిమా ల్లో ఈయన పాత్రలు ఎప్పటికి మర్చిపోలేనివి అనడంలో సందేహం లేదు.
అలాంటి సినిమాలు చేసిన కృష్ణ భగవాన్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అవుతున్నారు. ఒకప్పుడు రోజు వారి పారితోషికం విషయంలో రికార్డు సృష్టించిన ఈయన ఇప్పుడు ఎంత ఇచ్చినా నటించేందుకు ఓకే అన్నట్లుగా ఉన్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ లో మనో కంటే తక్కువ పారితోషికంకు కృష్ణ భగవాన్ వస్తున్నాడు. why singer mano not doing jabardasth show judge పైగా షూటింగ్ ఉన్న సమయంలో మనో చెన్నై నుండి రావాల్సి వస్తుంది. అందుకు సంబంధించిన ఖర్చులు ఉంటున్నాయి. అలాగే ఇబ్బందులు కూడా ఉంటున్నాయి. అందుకే మనో ను పక్కన పెట్టాలని సరైన ప్రత్యామ్నాయం కోసం మల్లెమాల వారు వెయిట్ చేశారు. ఎట్టకేలకు మనో కు ప్రత్యామ్నాయంగా జబర్దస్త్ కి కృష్ణ భగవాన్ లభించాడు. ఇంద్రజ తో కలిసి ఆయన చేస్తున్న ఎపిసోడ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే మల్లెమాల వారు మనో ను పూర్తిగా దూరం పెట్టేసినట్లే అంటూ టాక్ వినిపిస్తుంది.