ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరు రావడం చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. సిబిఐ తాజాగా ఎమ్మెల్సీ కవిత కి కేసు విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ లేదా హైదరాబాద్ లో మీకు ఎక్కడ వీలైతే అక్కడ అధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సిబిఐ నోటిలో పేర్కొంది. ఇప్పటికే కవిత ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బిజెపి నాయకుల పై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఏకంగా సిబిఐ నోటీసులు అందడంతో ఆమె ఎలా స్పందిస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఢీ కొట్టలేక మోడీ మరియు బిజెపి నాయకులు ఇలా కవిత పై అక్రమ కేసులు బనాయిస్తున్నారు అంటూ టిఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి ఎంత ప్రయత్నించినా కూడా టిఆర్ఎస్ నాయకుల యొక్క మనో ధైర్యంను దెబ్బ తీయలేరని ఆ నాయకులు మాట్లాడుతున్నారు. కవితకు మద్దతుగా పార్టీ మొత్తం ఉంటుందని ఇప్పటికే మంత్రులు మరియు ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.