శరీరంలో సరైన మెటబాలిక్ ప్రక్రియ నిర్వహణ కోసం కొలెస్ట్రాల్ అవసరం.అయితే కొలెస్ట్రాల్ రెండు రకాలు. ఒకటి ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్), రెండోది హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్). ట్రైగ్లైజరైడ్స్ అనే మరొక హాని చేసే కొవ్వుతో పాటు ఈ చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎక్కువ స్తాయిలో ఉంటే అది ధమనుల గోడలకు అతుక్కుపోయి మన గుండెకు ముప్పు తెచ్చిపెడుతుంది. ఇది 30 ఏళ్లలో జరగవచ్చు. లేదా ఆ తరువాతనైనా జరగవచ్చు. అది మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మీ రోజువారీ స్ట్రెస్‌పై ఆధారపడి ఉంటుంది. వయస్సు మీద పడుతున్నప్పుడు గుండె నాళాల్లో పూడికలు సహజమే. అయితే మీరు ఈ విషయంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కింద సూచనలు పాటించాలి. Eat the right kind of fats: ఆరోగ్యకర కొవ్వులను మాత్రమే తినాలి మనకు చెడు చేసే శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ జోలికి వెళ్లొద్దు. ప్రాసెస్డ్ మాంసం, ఫ్రైడ్ ఫుడ్, బేక్‌డ్ ఫుడ్స్‌లో చెడు కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌కు కారణమవుతాయి.
వీటిని పక్కనపెట్టి ఆరోగ్యకర ప్రత్యామ్నాయాల వైపు మళ్లండి. ఇంటి దగ్గర ఉడికించిన ఆహారమే తినండి. ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన వంట నూనెలను వినియోగించడంతో పాటు ఒమెగా-3 ఉన్న ఆహారం తీసుకోవాలి. ట్రైగ్లైజరిడ్స్, చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచాలంటే ఒమెగా-3 రిచ్ ఫుడ్స్ అవసరం. బాదాంలు, అవిసె గింజలు, వాల్ నట్స్, ఒమెగా 3 సప్లిమెంట్స్ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే వనరులు. Exercise & manage weight: వ్యాయామం, బరువు రోజుకు కనీసం 20 నిమిషాల వ్యాయామం తప్పనిసరి. తద్వారా కొలెస్ట్రాల్‌ను అదుపులో పెట్టొచ్చు. ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం వల్ల శరీరం అధిక కేలరీలను శక్తిగా మార్చుకుంటుంది. తద్వారా కొవ్వు నిల్వగా మారదు. కొవ్వు నిల్వలు పేరుకుపోతే అవి హానికరంగా మారుతాయి. అంతిమంగా గుండె పోటుకు దారితీస్తాయి. smoking and alcohol consumption: పొగ, మద్యం మానేయండి శరీరం కొలెస్ట్రాల్ విషయంలో స్పందించే తీరును స్మోకింగ్ నేరుగా ప్రభావితం చేస్తుంది. పొగాకు వల్లే వచ్చే తార్ ధమనుల్లో కొలెస్ట్రాల్ త్వరగా పేరుకుపోయేలా చేస్తుంది. పొగ తాగడం మానేసినప్పుడు సానుకూల ఫలితాలు వెలువడ్డట్టు నిరూపితమైంది. ఏదైనా అతిగా తీసుకోవడం అనర్థాలకు దారితీస్తుంది. మద్యం కూడా అలాంటిదే. ఇది చెడు కొలెస్ట్రాల్‌కు కారణమై మీ గుండెపై ఒత్తిడి కలిగిస్తుంది.