UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 బాలీవుడ్ దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌తో వర్క్ చేయాలనుంది..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో తన క్రేజ్ పాన్ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ప్రతి సినిమాకు తన లుక్స్‌తో పాటు నటనలో వైవిధ్యం చూపిస్తున్న స్టైలిష్ స్టార్ తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. అతడితో కలిసి పనిచేసేందుకు స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ దర్శకుల సైతం ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కూడా చేరిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయాలని ఉందని తన మనస్సులో మాట బయటపెట్టేశాడు. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి అతడు తెరకెక్కించిన సర్కస్ ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోహిత్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దక్షిణాది నటీనటుల గురించి ప్రస్తావన రాగా.. ఆయన ఎవరెవరితో సినిమా తీయాలని ఉంటుందో పంచుకున్నారు.

“నాకు దక్షిణాది స్టార్లలో అందరితోనూ సినిమా చేయాలని ఉంది. మరీ ముఖ్యంగా అజిత్, విజయ్, అల్లు అర్జున్, కార్తితో పనిచేయడం చాలా ఇష్టమని చెప్పారు. ఎప్పటికైనా వారితో సినిమా చేస్తాను” అని స్పష్టం చేశారు. పుష్ప చిత్రంతో పాన్ఇండియా సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ అయిన పుష్ప-2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతానికి పుష్ప-2 చిత్రీకరణ దశలో ఉండగా.. త్వరలోనే ఈ సినిమా అధికారిక విడుదల తేదీని ప్రకటించనుంది చిత్రబృందం. నవంబరు 13 నుంచి బ్యాంకాక్‌లో మొదటి షెడ్యూల్ జరగనుంది. మరోపక్క రోహిత్ శెట్టి దర్శకత్వంలో సర్కస్ అనే ట్రైలర్ అలరిస్తోంది. రణ్‌వీర్ సింగ్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఈమెతో పాటు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరో హీరోయిన్‌గా చేసింది. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 23న విడుదల కానుందీ చిత్రం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !