UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 జగన్ నే ట్రోల్ చేసిన మంచు లక్ష్మి.

సోషల్ మీడియాలో ట్రోల్స్ బాధితులెవరంటే ముందుగా గుర్తొచ్చేది మంచు ఫ్యామిలీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తుంటారు. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతుంటారు. అయితే దీనిపై చాలాసార్లు మంచు వారసులు ఫైర్ అయ్యారు. మంచు విష్ణు, లక్ష్మిలు తీవ్ర స్థాయిలో రియాక్డ్ అయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు మంచు లక్ష్మి ఒక పోస్టును రీట్విట్ చేసి వివాదాస్పదమయ్యారు. అది పొలిటికల్ అంశానికి సంబంధించి కావడంతో రాజకీయమవుతోంది. ఏకంగా ఏపీ సీఎం జగన్ పై కావడంతో వైసీపీ నేతలు, అభిమానులు తెగ రియాక్టవుతున్నారు. మంచు లక్ష్మి తీరుపై విరుచుకుపడుతున్నారు. అయితే దీనిపై మంచు లక్ష్మి స్పందించడం లేదు. అలాగని రీ ట్విట్ ను తొలగించడమూ లేదు. Manchu Lakshmi- Jagan వాస్తవానికి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన భావాలను, అభిప్రాయాలను పంచుకుంటారు. సహజంగా వివాదాస్పద అంశాల జోలికి పోరు. కానీ తన కుటుంబంలో జరిగే ప్రతి ఇష్యూను షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలో నెటిజెన్ల నుంచి అభ్యంతరకర కామెంట్లు ఎదురవుతుంటాయి. కానీ ఆమె ఎప్పుడు పట్టించుకోరు. అలాగని కంట్రవర్సీ కామెంట్స్ కు సైతం దూరంగా ఉంటారు. అటువంటి ఆమె ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ఓ పోస్టును రీ ట్విట్ చేశారు. ఏకంగా ఏపీ సీఎం జగన్ ను ‘లోల్’ అంటూ కామెడీగా పోస్టు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

అది జగన్ ను తీవ్రంగా అవమానించే ట్విట్ అని వైసీపీ శ్రేణులు తెగ బాధపడుతున్నాయి. సహజంగా ఇటువంటి అంశాల్లో రియాక్టయ్యే వైసీపీ శ్రేణులు అయితే మంచు లక్ష్మిపై విరుచుకుపడుతున్నారు. అయితే ఈ ట్విట్ ఏమిటన్న విషయాన్ని నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. కొన్నాళ్ల కిందట ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆల్పాబీటకల్ ఆర్డర్ ప్రకారం జగన్ కు మొదటి కుర్చీ కేటాయించారు. అక్కడ కూర్చున్న సీఎం జగన్ ఏంచేయాలో తెలియక బిత్తరచూపులు చూశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. బీ లైక్ అంటూనే నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. పెళ్లి బంతిలో కూర్చొని విస్తరాకుల కోసం ఎదురుచూస్తున్న నేను..ఎగ్జామ్ హాల్ లో కొశ్చన్ పేపర్ చూశాక నా పరిస్థితి. సీరియస్ మీటింగ్ లో కడుపులో గిరగిరా తిరిగితే .. ఎలా ఉందంటే అంటూ మిమ్స్ పెడుతున్నారు. పొలిటికల్ ప్రత్యర్థులు, ఎదురు పార్టీ అభిమానులు ఈ మిమ్స్ ను వైరల్ చేస్తున్నారు. Manchu Lakshmi- Jagan ఈ క్రమంలో మంచు లక్ష్మి ఓ కామెంట్స్ ను రీ ట్విట్ చేశారు. మరింత పరువుతీసేలా లోల్ అంటూ కామెంట్ జత చేసింది. ఇప్పుడది సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. మంచు మోహన్ బాబు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. పైగా సీఎం జగన్ తో బంధుత్వం ఉంది. సీఎం బాబాయ్ కుమార్తెనే మంచు విష్ణు వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి జగన్ మా బంధువు అంటూ అడిగినా.. అడక్కున్నా చెప్పే మంచు కుటుంబం ఇటీవల వైసీపీకి దూరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలీ, పోసాని వంటి వారికి పదవులిచ్చి.. తనకు తాను బిగ్ షాట్ గా పరిగణించే మోహన్ బాబును జగన్ పక్కన పడేశారన్న టాక్ ఉంది. ఇటువంటి తరుణంలో మంచు లక్ష్మి ట్రోల్ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమవుతున్నా రీ ట్విట్ ను తొలగించకపోడం పలు అనుమానాలకు తావిస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !