UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 జబర్దస్త్ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ మరో సారి నిరాశ

జబర్దస్త్ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ మరో సారి నిరాశ పరిచాడు. ఈటీవీ నుండి బయటకు వెళ్లిన తర్వాత స్టార్ మా లో ఒకటి రెండు షో లో కనిపించిన సుడిగాలి సుధీర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేక పోయాడు.

హీరోగా వరుసగా సినిమా లు చేస్తున కారణంగా తాను జబర్దస్త్ కి డేట్లు ఇవ్వలేక పోతున్నాను అంటూ ఒక సాకు చెప్పి పక్క ఛానల్ కి వెళ్లి పోయిన సుడిగాలి సుధీర్ అక్కడ సక్సెస్ అవ్వలేదు. దాంతో మళ్లీ ఈటీవీలో అడుగు పెట్టేందుకు ప్రయత్నించాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.

ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఆహా ఓటీటీలో సుధీర్ కామెడీ షో మొదటి ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ అయింది. అనిల్ రావిపూడి కూడా ఈ కామెడీ షోలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ పేరు తో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కామెడీ షో కి జనాల నుండి పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. ఓటీటీ కార్యక్రమం అంటేనే జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితి లేదు. టీవీ కార్యక్రమాలకు ఓటీటీ కార్యక్రమాలకు కాస్త తేడా ఉంటుంది. టీవీ కార్యక్రమాలు సక్సెస్ అయితే పెద్ద ఎత్తున చూస్తారు కానీ ఓటీటీ కార్యక్రమాలకు ఇంకా తెలుగు ప్రేక్షకులు అలవాటు పడలేదు.ఒకటి రెండు కార్యక్రమాల మినహా తెలుగులో ఇప్పటి వరకు ఏ ఒక్క ఓటీటీ కార్యక్రమం కూడా హిట్ అయిన దాఖలాలు లేవు. పైగా ఆహా యొక్క ఖాతాదారులు కొద్ది మందే ఉంటారు. దాంతో ఈ కార్యక్రమాన్ని చూసేవారు కానీ సుధీర్ యొక్క కామెడీని ఎంజాయ్ చేసేవారు కానీ ఎక్కువ మంది లేరు అంటూ టాక్‌ వినిపిస్తుంది. కొందరు సుధీర్ అభిమానులు మాత్రం ఎప్పుడు కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ వస్తుందా అంటే ఎదురు చూశారు. వారి ఎదురు చూపులకు తగ్గట్టుగానే నిన్న ఈ షో స్ట్రీమింగ్ అయ్యి వారికి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ముందు ముందు అయినా ఈ షో ఆహా అనిపిస్తుందేమో చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !