UPDATES  

 పెట్టుబడిదారులను తెలంగాణకు తరిమేస్తున్న CM జగన్

‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్టుంది జగన్ సర్కారు దుస్థితి. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన జగన్… పరిశ్రమల నిర్వహణలో ఎదురయ్యే ఒడిదుడుకులు తెలుసు. పరిశ్రమలపై ఆధారపడే కార్మిక, ఉద్యోగుల ఇతి బాధలు తెలుసు. అయినా తన రాజకీయం కోసం ఏపీలో పారిశ్రామికాభివృద్దితో వికృత క్రీడ ఆడుతున్నారు. కొత్త పరిశ్రమలను తేలేక వైఫల్యం చెందుతున్నారు. రాజకీయ కక్షతో ఉన్న పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారు.అమెరికాలో సుఖంగా ఉండే జీవితాన్ని వదులుకొని.. తామొక్కరే సుఖం ఉంటే చాలదని.. పుట్టిన ప్రాంతం వారు కూడా సుఖంగా ఉండాలన్న తలంపుతో చిత్తూరు జిల్లాలో అమర్ రాజా మోటార్ వాహనాల బ్యాటరీ సంస్థను నెలకొల్పారు గల్లా వంశీయులు. పరిశ్రమను అంచెలంచెలుగా అభివృద్ధి చేసి వేలాది మందికి.. వేలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. అటువంటి పరిశ్రమ ఇప్పుడు తెలంగాణకు తరలిపోతుందంటే అది జగన్ ప్రభుత్వ చర్యల ఫలితమే. CM Jagan వాస్తవానికి అమర్ రాజా పరిశ్రమ ఇతర ప్రాంతాలకు తరలిస్తారన్న ప్రచారం బిజినెస్ వర్గాలో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. దానిపై స్పందిచే క్రమంలో మన డిఫెక్టో సీఎం సజ్జల రామక్రిష్ణారెడ్డి విపరీత వ్యాఖ్యానాలు చేశారు. తనకున్న సకల శాఖ మంత్రి హోదాలో కక్ష సాధింపులకు ప్రణాళిక వేసే సజ్జల వారు..

వారు తరలిపోవడం ఏమిటి? మేమే తరిమేస్తామన్న రీతిలో మాట్లాడారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వారు వెళ్లడం కాదు.. మేమే దండం పెట్టి వెళ్లిపోమన్నామంటూ వ్యాంగ్యోక్తులు సంధిస్తూ కామెంట్లు సైతం చేశారు. సజ్జల లాంటి బడా వ్యక్తి ఉన్న పరిశ్రమల విషయంలో అలా అంటే.. కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సహజంగా భయపడతారు. దశాబ్దాలుగా వేల కోట్ల రూపాయల టర్నోవర్ తో, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధినిచ్చే అమర్ రాజా పరిశ్రమ తరలింపు నిర్ణయానికి వచ్చిందంటే.. కొత్త వారు ఎలా సాహసం చేయగలరు? అమర్ రాజా లాంటి పరిశ్రమ ఆల్ట్రనేషన్ ఆలోచించిన మరుక్షణమే తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. నేరుగా అమర్ రాజాకే ఆహ్వానాలు పంపాయి. తమ రాష్ట్రంలో పెట్టుపెడులు పెట్టాలని స్వాగతించాయి. చివరికి తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు నచ్చడంతో అమర్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రూ.9,500 కోట్లతో మోటారు వాహనాల బ్యాటరీల తయారీ సంస్థ నెలకొల్పడానికి సంబంధించి అమర్ రాజాతో ఒప్పందం సైతం పూర్తిచేసుకుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !