UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 ప్రభాస్ మారుతి మూవీ సెకండ్ షెడ్యూల్ …?

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సూపర్ నాచురల్ హారర్ కామెడీ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను దర్శకుడు మారుతి చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ప్రభాస్ సినిమా కోసం భారీ వ్యయంతో ఓ పాతకాలం నాటి థియేటర్ సెట్‌ను చిత్ర యూనిట్ వేసినట్లు వినికిడి. ఈ సెట్‌లోనే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగనుందని చెబుతున్నారు. పదిహేను రోజుల పాటు ఈ షెడ్యూల్‌ను కొనసాగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలిసింది.

ప్రభాస్‌, మారుతి సినిమాకు రాజా డీలక్స్ అనే పేరును పరీశీలనలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం టైటిల్‌తో పాటు షూటింగ్‌, క్యాస్టింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. లిమిటెడ్ బడ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాగా ప్రస్తుతం ప్రభాస్ పలు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నాడు. ప్రభాస్‌, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సలార్ సినిమా రూపొందుతోంది. అలాగే రామాయణ గాథ ఆధారంగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !