UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 మహేష్ బాబు – ఫొటో వైరల్‌ – బ్యాక్ టు వర్క్‌

తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హఠాన్మరణంతో గత కొద్ది రోజులుగా షూటింగ్‌లకు దూరంగా ఉన్న మహేష్‌బాబు తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టాడు. దాదాపు ఇరవై రోజుల విరామం తర్వాత ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. స్పోర్ట్స్ జాకెట్ ధరించి స్టైలిష్ లుక్‌లో కనిపిస్తోన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బ్యాక్ టు వర్క్ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు. మహేష్ బాబు పోస్ట్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేష్‌బాబు తిరిగి వర్క్ మొదలుపెట్టడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. గత నవంబర్ 15న గుండెపోటు సీనియర్ హీరో కృష్ణ కన్నుమూశారు. ఒక్క ఏడాదిలోనే తల్లిదండ్రులతో పాటు సోదరుడు దూరమవ్వడం మహేష్‌బాబు కుటుంబానికి తీరని లోటుగా మారింది. ఇటీవలే అభిమానుల సమక్షంలో తండ్రి పెద్ద కర్మను నిర్వహించాడు మహేష్‌బాబు.

తండ్రి దూరమైన బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మహేష్‌బాబు శనివారం నుంచి వర్క్ మొదలుపెట్టారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు మహేష్‌బాబు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మహేష్‌బాబు హీరోగా నటిస్తోన్న 28వ సినిమా ఇది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమాతో పాటుగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించారు మహేష్‌బాబు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !