ఢిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరవ్వాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఆ నోటీసులకు కవిత ఆలస్యం చేయకుండా స్పందించారు. విచారణకు హాజరు అయ్యేందుకు ఆమె చిన్న మెలిక పెట్టారు. సిబిఐ కి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీ తో పాటు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని, ఆ ఎఫ్ఐఆర్ కాపీ పరిశీలించిన తర్వాత తన వివరణ ఉంటుందని కవిత పేర్కొన్నారు.
ఇటీవల ఈ కేసులో భాగంగా హైదరాబాదులో కానీ ఢిల్లీలో కానీ మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అంటూ సిబిఐ కవితకి నోటీసులు పంపించారు.. దాంతో కవిత పై విధంగా స్పందించారు. కవిత లేఖలో తన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ డాక్యుమెంట్స్ పంపాలని.. డాక్యుమెంట్స్ అందిన తర్వాత మాత్రమే విచారణకు ఎప్పుడు హాజరయ్యేది చెబుతానంటూ కవిత సిబిఐ డిఎస్పి అలోక్ కుమార్ కి రాసిన లేఖలు పేర్కొన్నారు.