UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 SAMANTHA కొరియా నుండి వచ్చాక నాగ చైతన్యను కలువనుందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయో సైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇండియా తో పాటు పలు దేశాల్లో ఈ వ్యాధికి చికిత్స తీసుకున్న సమంత ప్రస్తుతం కొరియాలో ఉంది. అక్కడ ఈ వ్యాధి కి చికిత్స అద్భుతంగా ఉందంటూ సమాచారం అందడం తో సహితులతో కలిసి అక్కడికి వెళ్లిందట. సమంత మేనేజర్ అధికారికంగా కొరియా కు చికిత్స నిమిత్తం వెళ్తున్నట్లుగా తెలియజేశాడు. దాదాపు రెండు వారాల పాటు సమంత అక్కడ ఉంటుంది అనే ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ఎన్ని రోజులు అనే విషయమై క్లారిటీ లేదు. ఈ సమయంలోనే కొరియా నుండి సమంత ఇండియా కు తిరిగి వచ్చిన వెంటనే నాగ చైతన్య ను కలవబోతుంది అనే వార్తలొస్తున్నాయి. ఆ మధ్య నాగచైతన్య ను సమంత కలిసే అవకాశాలు ఉన్నాయని ఇద్దరి మధ్య ఏదో విషయమై చర్చ జరగబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయం లో ఇద్దరు కలవలేదు.

ఇప్పుడు చికిత్స నిమిత్తం నాగ చైతన్య సమంత కొరియా వెళ్లింది. ఆమె అక్కడ నుంచి వచ్చిన వెంటనే నాగ చైతన్య వెళ్లి కలవాలని భావిస్తున్నాడట. ఆ విషయాన్ని సమంత మేనేజర్ కి కూడా చెప్పాడని.. సమంత ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని క్లారిటీ లేదు కనుక వీరు ఏం మాట్లాడబోతున్నారు అనేది స్పష్టత రావాల్సి ఉంది. అసలు వీళ్ళు కలుస్తారా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. విడాకులకు సంబంధించిన వ్యవహారం మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకుంటారు. కానీ ఇద్దరు డైరెక్ట్ గా కలుసుకోవాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే మాదిరిగా ఈసారి కూడా సమంత నాగ చైతన్య కలవబోతున్నారు అనే వార్తలు పుకార్లు అయ్యి ఉండవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలంటే మరో రెండు వారాలు వెయిట్ చేయాల్సిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !