UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 ఆఫర్స్ పోగోట్టుకున్న శ్రీలీల

హీరోయిన్ శ్రీలీల పెళ్ళిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పాజిటివ్ కామెంట్స్ తోనే తన పేరును పాపులర్ చేసుకుంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చిన శ్రీలీల తొలి సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. తన అందం, నటనకు తగ్గట్టుగా డాన్స్ కూడా ఇరగదీస్తుంది. ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా సరే కళ్ళతో నటించేస్తుంది. దీంతో ఒక్కసారిగా శ్రీ లీల పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. త్వరలోనే రవితేజతో నటించిన ధమాకా సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. అలాగే మహేష్ బాబు నటించబోతున్న కొత్త సినిమాలో కూడా శ్రీ లీల సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్న ఎన్బికె 108 సినిమాలో శ్రీ లీల అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. వీటితోపాటు మరో ఐదు సినిమాలు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ భామకు సంబంధించిన హాట్ న్యూస్ వైరల్ గా మారింది. చేతినిండా సినిమాలు ఉన్న ఈ బ్యూటీకి మరో స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వడంతో కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక అంతకుముందు ఓకే చేసిన స్టార్ హీరో సినిమా నుండి తప్పుకోవడానికి రెడీ అయిందట.ఇదే విషయాన్ని శ్రీ లీల డైరెక్టర్ కి కూడా చెప్పిందట. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ సినిమా నుండి తప్పుకోవాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చిందట. డైరెక్టర్ నేరుగా హీరోకి చెప్పగా హీరోని డైరెక్ట్ గా శ్రీ లీలకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఎదగాలంటే ముందు పద్ధతిగా ఉండాలని, మాట మీద నిలబడాలని అలా ఉంటేనే హీరోయిన్గా ఛాన్సులు వస్తాయని ఆమెకు వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు నా సినిమా నుంచి తప్పుకునే అవకాశం లేదు అగ్రిమెంట్ పై సైన్ చేసావ్ అంటూ మాట్లాడినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో నెట్టుకు రావాలంటే ఆచితూచి అడుగులు వేయాలి అని అంటున్నారు అభిమానులు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !