UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 పర్ పవర్స్ ఉన్న హీరోగా ప్రభాస్ రోల్

ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ప్రాజెక్ట్ కే. దాదాపు ఐదు కోట్ల వ్యయంతో ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సెంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో ప్రాజెక్ట్ కే రూపొందనున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అందులో వాస్తవం లేదని తెలిసింది. సూపర్ హీరో కథాంశంతో నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సూపర్ పవర్స్ ఉన్న హీరోగా ప్రభాస్ రోల్ పవర్‌ఫుల్‌గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. తనకున్న పవర్స్‌తో దుష్ట శక్తులతో ప్రభాస్ ఎలాంటి పోరాటం చేశాడన్నది ఈ సినిమా కథ అని చెబుతున్నారు. మైథలాజికల్ టచ్‌తో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ కథను రాసుకున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రాజెక్ట్ కేతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్‌బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.దిశాపటానీ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తోన్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ బాషల్లోకి డబ్ చేయబోతున్నారు. 2023 అక్టోబర్ 18న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !