అడివి శేష్ (Advis sesh) హీరోగా నటించిన హిట్ -2 సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. రెండో రోజుల్లోనే ఈ సినిమా 20.1 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఓవర్‌సీస్‌లో శుక్ర, శని వారాల్లో కలిపి 5.42 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా నిలిచింది. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా హిట్ -2 సినిమా 12 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా రెండో రోజు ఎనిమిది కోట్ల వరకు వసూళ్లు సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
మూడో రోజైన ఆదివారం కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. హీరో నాని ఈ సినిమాను నిర్మించాడు. ఇందులో కృష్ణదేవ్ అనే పోలీస్ ఆఫీసర్‌గా అడివిశేష్ నటించాడు. క్రిమినల్స్‌ను పట్టుకోవడం ఈజీ అని భావించే కృష్ణదేవ్‌కు ఓ సైకో కిల్లర్ ఎలాంటి ఛాలెంజ్ విసిరాడు. తన తెలివితేటలతో ఆ సైకో కిల్లర్‌ను కృష్ణదేవ్ ఎలా పట్టుకున్నాడనే కథాంశంతో శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కించాడు. హిట్ -1 సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా హిట్ -2లో అడివిశేష్ నటించాడు. హిట్ ఫ్రాంచైజ్‌లో మూడో భాగం రాబోతున్నది. హిట్ -3 టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని (Hero Nani)హీరోగా నటించబోతున్నాడు. సర్కార్ పాత్రలో అతడు కనిపించబోతున్నట్లు హిట్ -2 క్లైమాక్స్‌లో రివీల్ చేశారు.