UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 SRIYA SHARAN చెప్పిన దారుణ నిజం !

హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన నీ మనసు నాకు తెలుసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసింది శ్రియ. ఒకప్పుడు యువకుల కలల రాణిగా శ్రియ యువకుల మనుసులు దోచుకుంది. ఇక శ్రియా ఇప్పటికి తెలుగు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. శ్రియ కొన్ని సంవత్సరాల క్రితం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాలో శ్రియ నటనకు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ మధ్యన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక పాత్రలో నటించింది శ్రియ.

రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా భారీ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో శ్రియ అజయ్ దేవగణ్ నటించింది. ఈ పాత్ర కొద్ది నిమిషాల పాటు కొనసాగుతోంది. అయినప్పటికీ ఈ క్యారెక్టర్ ద్వారా శ్రియ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకుంది. Shriya Saran say about rajamouli in RRR movie making time ఇక ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీయ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సమయంలో ఎస్ఎస్ రాజమౌళి అనారోగ్యంగా చాలా ఇబ్బందులు పడ్డారని ఆమె వెల్లడించింది. శ్రీయ తనకు తెలిసినంతవరకు రాజమౌళి ఆస్తమా తో ఇబ్బంది పడుతూనే సినిమా షూటింగ్ పూర్తి చేశారని చెప్పుకొచ్చింది. సెట్ మొత్తం దుమ్ముతో నిండిపోయి ఉన్నప్పటికీ రాజమౌళి ధ్యాస మొత్తం సినిమా పైనే ఉండేది అని శ్రియ చెప్పుకొచ్చింది. రాజమౌళి ఆరోగ్యం బాగా లేకున్నా ఎంతో కష్టపడి ఆర్ఆర్ఆర్ సినిమా అని తెరకెక్కించారు. ఆయన పడ్డ శ్రమకి తగిన ఫలితమే లభించింది అని చెప్పవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !