UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 BREAKING NEWS ,… పవన్ కల్యాణ్ – ప్రభాస్ ఫ్యాన్స్…

ఏ సినీ వుడ్ అయినా సరే ఫ్యాన్స్ వార్ అనేది ఉంటూనే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో వైరానికి దూరంగా స్టార్ లంతా ఒకరితో ఒకరు కలిసిపోయి ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పాన్ ఇండియా లెవెల్ లో హిట్లు కొట్టాలని తపిస్తున్నారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య భీమవరం మరియు పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఫ్యాన్ వార్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఒకానొకప్పుడు ఆ ప్రాంతాలలో 144 సెక్షన్ ను అమలు చేశారు అంటే అర్థం చేసుకోవాలి. దీని అర్థం పవర్ స్టార్ అంటే రెబల్ స్టార్ కి పగ ప్రతీకారమా? అంటే వారి మధ్య లాంటివి ఏమీ ఉండవు. అవి కేవలం అభిమానుల్లో ఒక సెక్షన్ సృష్టించే రాజకీయ పన్నాగాలాంటివని చెప్పాలి.సెక్షన్ సృష్టించే రాజకీయ పన్నాగాలాంటివని చెప్పాలి. ఇది చాలా సందర్భాలలో ప్రూవ్ కూడా అయింది అయితే హీరోలు ఎవరు విజయం సాధించినా సరే ఒకరినొకరు అభినందించుకుంటారు. ఆ విషయాన్ని వారు కూడా ఆస్వాదిస్తామని చెబుతుంటారు. అలాంటి స్నేహబంధం ప్రతి హీరో మధ్య ఉంటుంది. మరి ఫ్యాన్స్ మధ్య ఎందుకు ఈ గడ బీడ లు అనేది ఎవరికీ అర్థంకాదని చెప్పాలి. అయితే ఇప్పుడు సాహో తీసిన సుజిత్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చినట్లు సమాచారం.

ప్రభాస్ నటించిన సాహో భారి అంచనాలతో విడుదలై ఫ్లాపైనప్పటికీ , టెక్నికల్ గ్లిమ్స్ పై ప్రశంసలు కురిసాయి. ఇంతటి భారీ సినిమాను కిడ్ ఎలా హ్యాండిల్ చేయగలిగాడు అన్న సందేహాలు ప్రతి ఒక్కరికి వచ్చాయి. అయితే సుజిత్ అసమాన్యుడినని నిరూపిస్తూ ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ తోనే సినిమాని లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంకా ఈ సినిమాకు డివివి దానయ్య నిర్మాతక గా వ్యవహరిస్తున్నారు. Breaking news for Pawan Kalyan and Prabhas fans ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమా ప్రస్తావన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేండింగా ఉంది. ఈ ప్రకటన విడుదలైన కొద్దినిమిషాల్లోనే ఈ న్యూస్ వైరల్ అయింది. అభిమానులంతా పోస్టర్లోని కోడ్ ను డీ కోడ్ చేసే నిమగ్నులయ్యారు. పవన్ సుజిత్ మరియు పవన్ కళ్యాణ్ తొలి కలయిక పై ఈ కాంబినేషన్ బిగ్ బ్యాంగ్ గా అలరించబోతుందని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ లో హృదయపూర్వకంగా వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభాస్ నుండి పవన్ స్టార్ కి శుభాకాంక్షలు అందడంతో ఫాన్స్ లో ఉత్సాహం పెరిగింది. అగ్ర హీరోల నడుమ స్నేహబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఓ మల్టీ స్టార్ సినిమా వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !