తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ‘దత్త’ రాజకీయాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆ రాష్ట్రంలో దూసుకుపోతున్న జనసేనాని పవన్ కళ్యాణ్‌ను టీడీపీ దత్త పుత్రుడిగా ప్రచారం చేస్తున్నారు. ఈ ముద్రను జనంలోకి తీసుకెళ్లేందుకు అధికార వైసీపీ నేతలూ చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు కూడా ”దత్త” రాజకీయాలు అందుకున్నారు. అయితే ఇక్కడ ఆ ముద్రను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలపైనే వేయాలని ప్రయత్నం చేయడం గమనార్హం. షర్మిల బీజేపీ దత్త పుత్రిక అని ఆరోపిస్తున్నారు. pawan kalyan- ys sharmila ‘దత్త’ ముద్ర ప్లస్సా.. మైనెస్సా..? ఏపీలో జనసేనపైన, తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీపైన ఇలాంటి దత్తత ప్రచారం ఇటీవల ఉధృతమైంది. ఏవరిపై ఆయితే ఆ ముద్ర వేస్తున్నారో.. వారితో తమకు ముప్పు ఉందని భావించిన అధదికార పార్టీ నేతలే ఇలా ప్రచారం చేయడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆనేతల పార్టీలతో తమకు నష్టం జరుగుతుందని భావించి.. వారి ప్రచారాన్ని తగ్గించడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని పేర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ బలపడితే ఆ మేరకు తమకు నష్టం జరుగుతుందని.. అదే ఆయన చంద్రబాబు కోసం పని చేస్తున్నారని ప్రచారం చేస్తే.. ఆయన క్యాడర్ కూడా తమ వైపు మొగ్గుతారని వైఎస్‌ఆర్‌సీపీ అంచనా. అదే సమయంలో షర్మిలపై బీజేపీ ముద్ర వేస్తే.. ఆమెకు ఓట్లేయాలనుకున్న వారు ఆగిపోతారని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోందని అనుకోవచ్చు.
తద్వారా ”దత్త” ముద్ర తమకు ప్లస్ అవుతుందని, వారికి మైనస్ అవుతుందని అధికార పార్టీలు అంచనా వేస్తున్నాయి. వారితో.. ప్రమాదకరమని.. ఆంధ్ర, తెలంగాణలో అధికారంలోకి రావడానికి జనసేన, వైఎస్సార్‌టీపీలు ప్రయత్నం చేస్తున్నాయి. రెండు పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్, షర్మిల ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో సమస్యలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పోరాటాలు, దీక్షలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని పవన్ కళ్యాణ్, షర్మిల ధీమాగా చెబుతున్నారు. జనసేనాని అయితే ఏకంగా వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ చేస్తానని ధైర్యంగా చెబుతున్నారు. ఇక షర్మిల కూడా తెలంగాణలో సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేల ఆరోపణలు ఎండగడుతున్నారు. తమకు ఒక్క చా¯Œ ్స ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. దీంతో వారిని ప్రధాన ప్రత్యర్థులుగా భావించని అధికార పార్టీలు మాత్రం.. ఇతరులతో కలిపేందుకు శక్తివంచన లేకుండా దత్తత వ్యూహంతో రాజకీయాలు చేస్తున్నాయి. pawan kalyan- ys sharmila దీటుగా బదులిస్తున్న.. పవన్, షర్మిల ఆంధ్ర, తెలంగాణలో అధికార వైసీపీ, టీఆర్‌ఎస్ చేస్తున్న ‘దత్త’ రాజకీయాలను జన సేనాని పవనన్, వైఎస్సార్‌టీపీ అధదినేత్రి షర్మిల దీటుగా తిప్పి కొడుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే తనను ఇంకోసారి దత్త పుత్రుడు అంటే… సీఎం జగన్‌ను జైలు దత్తపుత్రుడు అని కూడా అంటారని హెచ్చరించారు. అయినా వైసీపీ నాయకులు మాత్రం ‘దత్త’ రాజకీయం కొనసాగిస్తున్నారు. ఇక షర్మిల కూడా తాను ఎవరి కోసమే పాదయాత్ర చేయాల్సిన పనేంటని ప్రశ్నిస్తున్నారు. తనను ఎదుర్కొనే ధైర్యంలేక, తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీఆర్‌ఎస్ నాయకులు దాడులు చేస్తున్నారని, దత్త పుత్రిక అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తిప్పి కొడుతున్నారు. Dailyhunt