బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ఇంటర్నేషనల్ వేదికపై మెరిసింది. ఈసారి ఏకంగా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో ట్రోఫీని ఆవిష్కరించే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. ఫిఫా చరిత్రలో ఇలా ఓ నటికి ఈ అవకాశం రావడం బహుశా ఇదే తొలిసారి. ప్రస్తుతం ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ డిసెంబర్ 18న లూసెయిల్ స్టేడియంలో జరగనుంది. దీనికోసం దీపికా ఖతార్ వెళ్లనుంది. ఆ మధ్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియా తరఫున జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించిన దీపికా.. ఇప్పుడీ అరుదైన అవకాశంతో మరోసారి ఇంటర్నేషనల్ లెవల్లో తన చరిష్మాను చాటింది. ఇక ఫైనల్ తర్వాత క్లోజింగ్ సెర్మనీలో మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహి పర్ఫార్మ్ చేయనున్న విషయం తెలిసిందే. దీంతో ఈసారి వరల్డ్‌కప్‌లో ఇండియాకు ఇలా ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కినట్లయింది.
సినిమాల విషయానికి వస్తే దీపికా ప్రస్తుతం షారుక్‌ఖాన్‌తో కలిసి పఠాన్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని 8 దేశాల్లో చిత్రీకరించడం విశేషం. ఇక ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌కు ముందే తొలి పాట రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మూవీతోపాటు ప్రభాస్‌తో కలిసి ఆమె ప్రాజెక్ట్ కేలోనూ నటిస్తోంది. ఇక తన భర్త రణ్వీర్తో కలిసి సర్కస్ మూవీలో ఓ స్పెషల్ డ్యాన్స్ నంబర్లో కూడా కనిపించనుంది. ఇవే కాకుండా సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లోనే హృతిక్ రోషన్‌తో కలిసి ఆమె ఫైటర్ మూవీలో నటించబోతోంది. ఇది ఇండియాలో తొలి ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా నిలవనుంది.