UPDATES  

 సునీత త్వరలోనే వెండితెరకు పరిచయం..?

టాలీవుడ్ లో ప్లే బ్యాక్ సింగర్ సునీత గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే సింగర్ గా ఉన్న సునీత త్వరలోనే సినిమాలో నటించబోతుందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు సునీత తన భర్త బెస్ట్ ఫ్రెండ్ అయినా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించబోతుందని ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే సునీత మంచి గాయని అని. ఆమె పాట పాడితే ఎలాంటి ఒత్తిడి అయిన దూరం అవుతుంది. అలాంటి మ్యాజిక్ వాయిస్ సునీత సొంతం. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న సునీత త్వరలోనే వెండితెరకు పరిచయం అవబోతుందని సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. \

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ఓ సినిమాలో సునీత గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అది కూడా మహేష్ బాబుకి అక్కగా నటించబోతుంది. నిజానికి ఆ చిన్న పాత్ర చేయడానికి ఆమెకు అస్సలు ఇష్టం లేదట. అయితే ఆమె భర్త రామ్ వీరపనేని దగ్గరుండి ఆమెను ఒప్పించారట. అంతేకాదు మహేష్ బాబు సునీతకి కాల్ చేసి రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా మహేష్ బాబు, రామ్ ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ద్వారా సునీత వెండితెరకు పరిచయం అవ్వబోతుంది అని సంతోష పడుతున్నారు అభిమానులు. నిజానికి హీరోయిన్ కి మించిన అందం సునీత సొంతం. ఆమె సినిమాలో కి వస్తే చూడాలని ఉంది అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ వార్త నిజమో కాదు మహేష్ బాబు సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !