UPDATES  

 అరంగేట్రంతోనే అద్భుత విజయాలిచ్చిన దర్శకులు

కరోనా కారణంగా గత రెండేళ్లుగా సినీ రంగంపై తీవ్ర ప్రభావం పడగా.. ఈ ఏడాది మాత్రం థియేటర్లు కళ కళలాడటంతో తెలుగు చిత్రసీమలో మంచి విజయాలు పడ్డాయి. అంతేకాకుండా అల్లు అర్జున్, బాలకృష్ణ మినహా మిగిలిన స్టార్ హీరోల సినిమాలు ఈ సంవత్సరం థియేటర్లలో సందడి చేశాయి. ఒకటి రెండు మినహా దాదాపు విజయాలనే అందుకున్నాయి. ఇక దర్శకుల విషయానికొస్తే ఎస్ఎస్ రాజమౌళి, పరశురామ్, అనిల్ రావిపూడి లాంటి సీనియర్ డైరెక్టర్లే కాకుండా.. కొంతమంది కొత్త దర్శకులు తమ తొలి చిత్రంతోనే అద్భుత విజయాలను సొంతం చేసుకున్నారు. వీరిలో డీజే టిల్లు, అశోక వనంలో అర్జున కల్యాణం, ఒకే ఒక జీవితం లాంటి సూపర్ హిట్లను కొత్త డైరెక్టర్లు తెరకెక్కించినవే. మరి 2022లో చిత్ర సీమలో అరంగేట్రం చేసి తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కొత్త దర్శకులెవరో ఇప్పుడు చూద్దాం. విమల్ కృష్ణ(డీజే టిల్లు).. డీజే టిల్లు చిత్రంతో తన మొదటి చిత్రంతోనే సాలిడ్ హిట్ అందుకున్నాడు విమల్ కృష్ణ. సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా హీరో సిద్ధు యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా తనదైన టేకింగ్‌తో విమల్ కృష్ణ.. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. థ్రిల్లర్ జోనర్‌కు కామెడీని జోడించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం నరుని బ్రతుకు నటన అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది. విద్యాసాగర్ చింతా (అశోక వనంలో అర్జున కల్యాణం).. ఈ నగరానికి ఏమైందీ, ఫలక్‌నూమా దాస్ చిత్రాలతో తనదైన మాస్ మేనరిజాన్ని కలిగి ఉన్న విశ్వక్ సేన్‌కు అశోక వనంలో అర్జున కల్యాణం రూపంలో క్లాస్ హిట్ ఇచ్చాడు విద్యాసాగర్. ఈ సినిమా మేలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా మంచి వసూళ్లను సాధించింది. విశ్వక్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. ఇందులో విశ్వక్ నటన, లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. గతంలో అతడి నటించిన సినిమాలకు, దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. స్టోరీ సింపుల్‌గా ఉన్నప్పటికీ.. కథనం, డైలాగ్స్‌తో సినిమాను ఆసక్తిగా తెరకెక్కించి విజయం సాధించారు విద్యాసాగర్. తొలి ప్రయత్నంలోనే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ తెరకెక్కించి అ దిశగా సక్సెస్ అయ్యారు. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అయిన విద్యాసాగర్.. ఈ సినిమాను మరింత ఆకర్షణీయంగా రూపొందించారు. మల్లిడి వశిష్ట (బింబిసార).. మొదటి చిత్రాన్ని ఏ దర్శకుడైనా ప్రేమ కథ లేక హర్రర్, థ్రిల్లర్ జోనర్‌ వైపు ఆసక్తి చూపుతారు. కానీ వశిష్ట మాత్రం దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని సోషియో ఫాంటసీగా తెరకెక్కించారు. కల్యాణ్ రామ్ హీరోగా అతడు రూపొందించిన బింబిసార చిత్రం ఈ ఏడాది అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత కల్యాణ్ రామ్‌కు మంచి విజయాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా రూపొందించే పనిలో పడ్డాడు వశిష్ట. సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగానూ ఆకట్టుకుంది. బాహుబలితో పోల్చలేం కానీ పరిమితుల మధ్య కథను తెరకెక్కించడంలో వశిష్ట సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !