యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో ఇంకా వెండితెరపై తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతూ ఉంది. ఒకపక్క చేతినిండా సినిమాలతో మరోపక్క టీవీ షోలలో సైతం ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. సాధారణంగా టెలివిజన్ రంగంలో యాంకర్ లుగా వయసులో ఉన్నవాళ్లు ఉంటారు. కానీ అనసూయ పెళ్లయిపోయి 40 సంవత్సరాల కు దగ్గరలో ఉన్న గాని … కుర్ర యాంకర్లకు మంచి పోటీ ఇస్తుంది. యాంకర్ గా మాత్రమే కాకుండా సినిమా రంగంలో అన్ని రకాల పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది.డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం, పుష్ప సినిమాలలో అద్భుతమైన పాత్రలు చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ లతో అదరగొట్టే అనసూయ… తాజాగా చీర కట్టులో అదిరిపోయే ఫోజులిచ్చింది. గ్రీన్ కలర్ బ్యాక్ గ్రౌండ్ గ్రీనరీలో…బ్లూ కలర్ శారీలో లాంగ్ చెవిపోగులతో.. అనసూయ చూపిస్తున్న ఏధా అందాలు కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి. Anasuya Bharadwaj latest pics on instagram దీంతో ఈ ఫోటోలకు భారీ ఎత్తున కామెంట్లు మరియు లైకులు కొడుతున్నారు. ఇదిలా ఉంటే పుష్ప మొదటి భాగంలో నెగిటివ్ పాత్రలో కనిపించిన అనసూయ.. రెండో భాగంలో ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు సమాచారం. మొదటి భాగంలో సమంత ఐటెం సాంగ్ చేసింది. “ఊ అంటావా ఊఊ అంటావా” అనే సాంగ్ కి సామ్ వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ లో మాత్రం అనసూయ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.