సినిమా పరిశ్రమలో టైమింగ్ ముఖ్యం. అది చాలా మంది ఫేట్ మార్చేస్తుంది. ఆ విషయం బాగా తెలిసిన దిల్ రాజు చివరి నిమిషంలో వారసుడు డేట్ మార్చేశారు. జనవరి 12న విడుదల కావాల్సిన వారసుడు చిత్రాన్ని ఒక రోజు ముందుకు తీసుకెళ్లాడు. అనగా జనవరి 11న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాను నిర్మాతగా ఉన్న వారసుడు చిత్రాన్ని ఏ తేదీన విడుదల చేయాలనే విషయంలో సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని దిల్ రాజు ముందే అనుకున్నాడు. నిన్న విడుదలైన ట్రైలర్ లో కూడా పొంగల్ రీలీజ్ అని వేశారు కానీ స్పష్టమైన డేట్ చెప్పలేదు. Vijay Thalapathi కాబట్టి పరిస్థితులను బట్టి ఓపెనింగ్స్ దక్కేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.తన ప్లాన్ లో భాగంగా జనవరి 11న వారసుడు విడుదల చేస్తున్నాడు.
అదే రోజు అజిత్ తెగింపు విడుదల చేస్తున్నారు. అంటే కోలీవుడ్ టాప్ స్టార్స్ ఇద్దరూ ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నారు. అయితే తెలుగులో విజయ్ కే అడ్వాంటేజ్ ఉంది. దిల్ రాజు సినిమా కావడంతో పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. తెగింపు చిత్రానికి పెద్దగా హైప్ లేదు. అందులోనూ విజయ్ మార్కెట్ తో పోల్చుకుంటే అజిత్ మార్కెట్ తెలుగులో తక్కువే. Vijay Thalapathi అలాగే దిల్ రాజు జనవరి 12న కాకుండా 11న విడుదల చేయడానికి మరొక కారణం ఉందంటున్నారు. వారసుడు ట్రైలర్ చూశాక తెలుగు జనాలు పెదవి విరిచారు. పలు చిత్రాలతో పోల్చుతూ వారసుడు పాత చింతకాయ పచ్చడి అంటూ ఏకిపారేశారు. వారసుడు ట్రైలర్ సినిమాపై హైప్ పెంచకపోగా డామేజ్ చేసింది. ఈ క్రమంలో బాలయ్యతో పోటీపడటం మంచి ఆలోచన కాదని దిల్ రాజు భయపడ్డారంటున్నారు. జనవరి 12న వీరసింహారెడ్డి విడుదల అవుతుంది. వీరసింహారెడ్డి మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది.