మన్యంన్యూస్, మణుగూరు, జనవరి 07: సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య సతీమణి అనసూర్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రామానుజవరం గ్రామంలో మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళిలు అర్పించారు. అయోధ్య చారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.