మన్యం న్యూస్,అశ్వాపురం: మండల కేంద్రానికి సమీపంలోని అశ్వాపురం పంచాయతీ పరిధిలో గల చౌటిగూడెం గ్రామంలో నిర్మించిన డ్రైనేజీలో మురుగునీరు నిల్వ ఉండడంతో అక్కడి గ్రామస్తులు దుర్వాసనతో పడుతున్న ఇబ్బందిని డ్రైనేజీ వాటర్ పోయే ఏర్పాట్లు చేయండి అని సోమవారం ప్రచురించడం జరిగింది. తక్షణమే స్పందించిన అశ్వాపురం సర్పంచ్ బానోత్ శారద, ఉప సర్పంచ్ భూక్య చందు లాల్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్యలు సమస్యను పరిష్కరించడం జరిగింది. పంచాయతీ కార్మికులతో మురుగును తొలగించి, బ్లీచింగ్ నిర్వహించారు .