మన్యం న్యూస్ గుండాల జనవరి 09: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన క్యాలెండర్ కాంప్లెక్స్ హెచ్ఎం కిషన్ ఆవిష్కరించారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయ సమస్యలను టీఎస్ యుటిఎఫ్ నిరంతరం పోరాడుతుందని అధ్యక్ష కార్యదర్శులు వీరన్న, ఎల్ రూప్ సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, బాలస్వామి, రామయ్య తదితరులు పాల్గొన్నారు