మన్యం న్యూస్ చండ్రుగొండ,జనవరి 10: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెడికల్ ఆఫీషర్ కనకం తనూజ పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కంటివెలుగు రెండో విడత కార్యక్రమంపై అవగాహన సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. తొలుత కంటివెలుగు పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. కంటి సమస్యలు ఉన్న వారు ప్రతి యొక్కరు ఈ నెల 18 నుండి గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం కంటివెలుగు ఉచిత పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని, అవసరం అయితే కళ్లఅద్దాలు ఇవ్వడం, లేక ఆఫరేషన్ చేయించటం జరుగుతుందన్నారు. ప్రతి ఇంట్లో కంటి సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఉంటే వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సమావేశంలో జెడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి, సర్పంచ్లు, ఎంపిటీసీలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు