UPDATES  

 సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలి… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలి… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ఈనెల 12వ భద్రాద్రి జిల్లాకు సీఎం కేసీఆర్
నూతన కలెక్టరేట్, జిల్లా బీ.ఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో ప్రభుత్వ విప్ రేగా సమీక్ష సమావేశం
మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 10.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 12న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి విచ్చేయుచున్నారని తొలుత పాల్వంచ కే ఎస్ ఎం కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని, కొత్తగూడెం రైటర్ బస్తి ప్రాంతంలో నూతనంగా నిర్మించబడిన బి ఆర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్పష్టం చేశారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లోని నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన ఆయన జిల్లాలోని పలు శాఖల అధికారులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు, సీఎం కేసీఆర్ నాయకత్వంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమీకృత కలెక్టరేట్లు ఉన్నట్లు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు, సుమారు 32 శాఖల అధికారులు ఒకే కార్యాలయంలో పరిపాలన ప్రారంభించు నందున ప్రజలకు సేవలు సులభతరం కానున్నాయన్నారు అన్ని సమస్యలకు పరిష్కారాలకు కలెక్టర్ కార్యాలయం వేదికగా మారనుంది అన్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్గ కాలం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఈనెల 18వ తేదీన ఖమ్మం జిల్లాలో కూడా పర్యటన ఖరారు కానుంది అన్నారు. మనసున్న మారాజు ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా పల్లె పల్లెకు వాడవాడకు వేలాదిమంది ప్రజలు తరలి రావాలని అందుకు ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఒక మన్యం బిడ్డకు టిఆర్ఎస్ పార్టీ తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేసి రేగా కాంతారావు కు కీలకమైన బాధ్యతను అప్పజెప్పడం వెనుక ఎవరైతే శక్తి వంచన లేకుండా పని చేస్తారో వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక గుర్తింపుని ఇస్తారనేది ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం ఎంతో శ్రమిస్తున్నారని ప్రభుత్వ విప్ రేగా అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు బీ ఆర్ఎస్ పార్టీ ముఖ్య ప్రజా ప్రతినిధులతో పాటు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు కూడా కృషి చేయాలని అన్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికి అక్కడికి నిఘా నేత్రాలని బలోపేతం చేయడం ఆనందానిచ్చిందన్నారు.

తెలంగాణ యాదిలో మన్యం బిడ్డ నిను మరువదు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ప్రత్యేక ఆశీస్సులు పొందునున్న ప్రభుత్వ విప్… రేగా కాంతారావు

నా తెలంగాణ కోటి రతనాల వీణ.. తెలంగాణ ఖ్యాతిని దేశవ్యాప్తంగా ఇనుమడింప చేయడంలో నోట్ల కట్లకు అమ్ముడుపోకుండా తెలంగాణ వాడిని వేడిని దేశంలో చవిచూపించిన ప్రభుత్వ వైపు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నికార్సైన తెలంగాణ బిడ్డ అని రూ 100 కోట్ల రూపాయలు ఆశ చూపిన అవి మాకు లెక్క కాదని తెలంగాణ ఆత్మ గౌరవాభిమానమే మాకు ముఖ్యమని బిజెపి దొంగలను ప్రభుత్వానికి పట్టించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ముఖ్యమంత్రి కెసిఆర్ చేత ప్రత్యేక ఆశీర్వాదాన్ని కొత్తగూడెం పర్యటనలో పొందనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు తీపి కొట్టి బిజెపికి బుద్ధి చెప్పిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మకంగా మిగిలిపోతుంది. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి విచ్చేయుచున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తెలంగాణ ఎమ్మెల్యేలు చేస్తున్న కృషికి కితాబు ఇస్తున్నారు అనడంలో అతిశయోక్తి కాదు. ఈ విషయంలో కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండి గల రాజేందర్ , జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ , జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్ల , పలు శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !