మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 08.. అశ్వరావుపేట మండలంలోని స్థానిక వడ్రబజార్ చిన్నంసెట్టీ బజార్ నందు గల యువకులు వాలీబాల్ కిట్లు కావాలని అదే బజారుకి చెందిన డేరంగులా శ్రీను ని కోరగా శ్రీను అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు మేనల్లుడి తాటి ప్రదీప్ చంద్రా దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే మెచ్చా సూచనలు మేరకు రెండు వాలీబాల్ కిట్లను స్థానిక మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి చేతుల మీదుగా బుధవారం క్రీడా కారులకు అందించటం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీపీ జల్లిపల్లి మాట్లాడుతూ యువత అన్ని రంగాలతో పాటు క్రీడా రంగంలో కూడ రాణించి అశ్వారావుపేట మండలానికి మంచి పేరు తీసుకు రావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వాలీబాల్ కిట్లని అందజేస్తున్నారనీ, అలాగే యువకులకు వాలీబాల్ వల్ల మంచి మానసిక ఉత్సాహం ఏర్పడుతుందని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి అన్నారు. ఈ సందర్బంగా యువకులు మాట్లాడుతూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ, నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే మెచ్చాకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టి టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, ఊట్లపల్లి సర్పంచ్ సాధు జ్యోత్స్న భాయి, డేరంగులా శ్రీను, యువకులు తదితరులు పాల్గొన్నారు.