UPDATES  

 మేమున్నాం.. వలస గొత్తి కోయ అంగన్వాడి పిల్లలకు.. హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ చేయూత

  • మేమున్నాం..
  • వలస గొత్తి కోయ అంగన్వాడి పిల్లలకు..
  • హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ చేయూత
  • గంగమ్మ కాలనీ మినీ అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు యూనిఫాం పంపిణీ

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08… అడవి బాటను మరిచి అక్షర జ్ఞానం వైపుకు తరలండి. అన్ని విధాలుగా సంపూర్ణ సహకారాన్ని అందిస్తాం. చదువుకునే బాల్యం మీది సహకరించే చేతులు మాది. అన్ని రకాలుగా ఆదుకుంటాం అందరిలో మేముంటాం అంటూ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం గట్టు మల్ల గ్రామపంచాయతీ పరిధిలోని గంగమ్మ కాలనీ వలస గొత్తి కోయల ఛత్తీస్గడ్ మినీ అంగన్వాడి కేంద్రంలో చదువుకుంటున్న చిన్నారులకు హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ విజయవాడ ద్వారా విద్యార్థులకు యూనిఫామ్ ను వెంకట్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి లెనినా చేతుల మీదుగా ఈ దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దట్టమైన అడవి ప్రాంతంలో నిర్వహింపబడుతున్న వలస గొత్తి కోయ చత్తీస్గడ్ మినీ అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు విజయవాడ నుంచి హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ద్వారా యూనిఫామ్ ను అందించడం ఎంతో గొప్పదని అన్నారు. దట్టమైన అడవి ప్రాంతంలో పొట్ట చేతులు పట్టుకుని బతుకుదెరువుకొచ్చిన గోతికోయా పిల్లల కోసం అనునిత్యం శ్రమిస్తూ అంగన్వాడి పాఠశాల ద్వారా విద్యాబుద్ధులను నేర్పుతూ వారి సంక్షేమ కోసం శతవిధాలుగా కృషి చేస్తున్న అంగనవాడి ఉపాధ్యాయురాలు జ్యోతి కృషి చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. ఒకవైపు అంగన్వాడి కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని అందిస్తూ మరోవైపు గొత్తుకోయ గిరిజనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి సహాయ సహకారాలను సమకూరుస్తూ అంగన్వాడి కేంద్రాన్ని మరింత బలోపేతం చేస్తున్న ఉపాధ్యాయురాలు జ్యోతి విధులు పట్ల ఎంతో అంకితభావం కలిగి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ రూరల్ సెక్టర్ సిడిపిఓ కనకదుర్గ ,సూపర్వైజర్ అశోక కుమారి, ఉపాధ్యాయురాలు భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !