UPDATES  

 ఓవర్ లోడ్ తో రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవు – మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తిరుపతి

 

మన్యం న్యూస్, భద్రాచలం / సారపాక ఫిబ్రవరి 22:
ఓవర్ లోడ్ తో రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తిరుపతి అన్నారు. బుధవారం భద్రాచలం, బూర్గంపాడు మండలాల పరిధిలోని పలు ప్రాంతాల్లో అధిక లోడుతో వెళ్తున్న కర్ర ట్రాక్టర్లు ఇతర వాహనాలపై తన బృందంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఓవర్ లోడు తో రవాణా చేస్తున్న పలు ట్రాక్టర్ల కు కేసులు నమోదు చేశారు. బూర్గంపాడు మండలంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో అనేక ప్రమాదాల్లో పలువురు మృతి చెందుతూ ఉన్న సంఘటన పునరావతం కాకుండా చూసేందుకు గత రెండు రోజులుగా భద్రాచలం, బూర్గంపాడు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ అధిక లోడుతో వెళుతున్న జామాయిల్ కర్ర రవాణా చేస్తున్న ట్రాక్టర్ల పై కొరడా జలపించారు. పలు వాహనాలను తనిఖీ నిర్వహించి కేసులు నమోదు చేశారు. మరికొన్ని వాహనాలకు జరిమానా విధించి హెచ్చరికలు జారీ చేశారు. బూర్గంపాడు మండల పరిధిలోని జామాయిల్ రవాణా చేసేవారు పరిమిత లోడ్ తో తోలకాలు నిర్వహించాలని, డ్రైవింగ్ లైసెన్సు, వాహన పత్రాలు అన్ని కలిగి ఉండవాలని సూచించారు. నిబంధన ప్రకారం రవాణా చేయాలని ప్రమాదాలను అరికట్టాలని వాహనాల యజమానులకు డ్రైవర్లకు తెలిపారు. అధిక లోడుతో రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. నిబంధన ప్రకారం రవాణా చేయాలని ఎప్పటికప్పుడు తనిఖీలు ఆకస్మికంగా నిర్వహించి కేసులు నమోదు చేయనున్నట్లుగా ఎంవిఐ తిరుపతి వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !