మన్యం న్యూస్,ఇల్లందు టౌన్ మార్చి 20:టీబీజీకేఎస్ అభ్యర్థన మేరకు సింగరేణి ఇల్లందు జనరల్ మేనేజర్ ఎం.శాలెంరాజు ప్రత్యేక శ్రద్దతో జేకే కాలనీలో బి -7 క్వార్టర్లోకి లైబ్రరీ మార్చటం జరిగింది. ఈ లైబ్రరీలో ప్రజలకు,కార్మికులకు, పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న యువతకు అన్నిరకాల సౌకర్యాలతో ప్రశాంత వాతావరణంలో అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచటం జరిగిందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇల్లందు బ్రాంచి ఉపాధ్యక్షులు ఎస్.రంగనాథ్ తెలిపారు. అలాగే ప్రముఖ దినపత్రికలు కూడా లైబ్రరీలో అందుబాటులో ఉంటాయని కావున పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, యువత, మాజీ కార్మకులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని కోరారు. పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ వ్రాత పరీక్షకు సింగరేణి సేవాసమితి శిక్షణను కూడా ఇస్తున్నదని కావున ఈ అవకాశాలను సద్వినియోగం చేయికోవాలని రంగనాధ్ తెలిపారు.
