మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం కొత్తపేట గ్రామంలో ఓడిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుకోలు కేంద్రాన్ని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల బాగోగుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రజలు ఉపయోగించుకొని ప్రజలు ఆర్ధికంగా అభివృద్ది చెందాలి అన్నారు,ప్రభుత్వం రైతుల నుంచి వడ్ల కొనుగోలు త్వరగా పూర్తి కావాలి అని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాము అన్నారు,ఈ కార్యక్రమంలో అచ్చ సత్యం,సెంటర్ ఇంచార్జ్ దిడ్డి శ్రీను రాంగాని నరేందర్, యూత్ నాయకులు రాజుపేట గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ ప్రవీణ్, బట్టు నరసింహరావు, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి,పూజారి వెంకన్న, అచ్ఛ ముకుందాం, దొంగరి నగేష్, పూజారి మహేష్, అచ్చ వెంకన్న, సంతసాని భద్రయ్య, నారెడ్ల పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.