మన్యం న్యూస్ మంగపేట.
ఏటూరునాగారం నుండి ఖమ్మం వరకు బస్ సర్వీస్ ను ఏర్పాటు చేయాలని మణు గూరు బస్ డిపో మేనేజర్ కు రాజుపేట గ్రామ స్తులు విన్నపం చేశారు.మంగపేట మండలం రాజుపేట గ్రామంలో మంగ ళవారం నిర్వహించిన దివ్యాం గులకు రాయితి బస్ పాస్ ల కార్యక్రమంకు వచ్చిన మణు గూరు బస్ డిపో మేనేజర్ స్వామికి వినతిపత్రం అంద జేశారు.రాజుపేట చుట్టుపక్కల గ్రామలలో ఉన్న ప్రజలు విద్యా ర్థుల ఎక్కువగా ఖమ్మం వెళ్తున్నారని ఖమ్మంలో మెరుగైన వైద్య సౌకర్యాలు ఉన్నందున ప్రజలు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో ఏటూ రునాగారం నుంచి ఖమ్మం రెండు బస్ లు ఉండేవి కరోనా సమయంలో వాటిని రద్దుచేశారని.అలా రద్దు చేసిన సర్వీస్ లను తిరిగి పున: ప్రారంభించా లని కోరారు.ఈ సందర్బంగా రాజుపేటకు వచ్చిన డిపో మేనేజర్ స్వా మిని శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్య క్రమం తెలంగాణ రాష్ట్ర విక లాంగుల సమితి అధ్యక్షు లు జానపట్ల జయరాజు,బోడ ప్రసాద్,కే నరసింహరావు,ఎర్ర శ్రీధర్,వికలాంగుల బస్ పాస్ ఇంచార్జి చేరుకురి ఉపేందర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్డి యుసాఫ్,కేఎస్ నారా యణ,పాల్గొన్నారు.