UPDATES  

 అశ్వరావుపేట జనసేన పార్టీ ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 17: అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో జనసేన పార్టీ పోస్టర్ ఆవిష్కరణ బుధవారం ఆ పార్టీ సభ్యులు నిర్వహించారు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో గడప గడపకు జనసేన పార్టీ నీ విస్తృత స్థాయిలో బలోపేతం చేసి రానున్న రోజుల్లో పార్టీని పూర్తిస్థాయిలో జనాల్లోకి తీసుకువెళ్ళడమే ఈ పోస్టర్ ఆవష్కరణ ముఖ్య ఉద్దేశమని అశ్వారావుపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ డేగల రామచంద్రరావు తెలిపారు . గ్రామస్థాయి నుండి జనాల్లోకి గాజు గ్లాస్ గుర్తును తీసుకు వెళ్ళడమే జనసేన పార్టీ యొక్క ముఖ్య లక్ష్యమని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇస్లావత్ వినోద్, బద్దిరెడ్డి రాజేష్, లింగిశెట్టి కుమార్ స్వామి, దామెర బాబి, రాజా, నాగు, మల్లం రామకృష్ణ, మంగా రవీంద్ర, ఉప్పల మల్లికార్జున, మల్లికార్జున రావు నందం బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !