మన్యం న్యూస్ గుండాల: మండలం పరిధిలోని ఎలగలగడ్డ గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ కార్యకర్త ఇర్ఫా నరసయ్య గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో అతని దశదినకర్మకు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల అనుసారం పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ 50 కేజీల బియ్యాన్ని అందించారు. నరసయ్య మృతి చెందడం బాధాకరమని పార్టీలో చురుకైన కార్యకర్తగా ఉండేవాడని అధ్యక్షులు తెల్లం భాస్కర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి టి రాము, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, పార్టీ నాయకులు తాటి కృష్ణ , లక్ష్మయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.