మన్యం న్యూస్, పినపాక:
మహిళల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం గర్భిణుల కోసం కేసీఆర్ కిట్లను అందించనున్నదని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు దుర్గాభవాని అన్నారు. పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. గర్భిణుల్లో పోషకాహార లోపం నివారణకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశామన్నారు.ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన న్యూట్రిషన్ కిట్లను 13నుంచి 24వారాలు ( రెండో త్రైమాసికం), 27 నుంచి 24 వారాలు (మూడో త్రైమాసికం) ఉన్న గర్భిణులు కిట్‌కు అర్హులని తెలిపారు.. ఒక్కో కిట్ రూ.2 వేల వరకు ఉంటుందని చెప్పారు. ఇందులో ఆరకిలో నెయ్యి, కిలో ఖర్జూర పండ్లు, ఒక్కొక్కటి కిలో చొప్పున రెండు హార్లిక్స్ బాటిల్స్, ఇతర పోషక పదార్థాలు ఉంటాయని తెలిపారు. అనంతరం 8 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు సైతం న్యూట్రిషన్ కిట్లను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సింధుజ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు .
